- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచిలో డబ్బుల కట్టలు.. సడన్‌గా..
<p>దిశ, జవహర్ నగర్: డబ్బు కట్టలు సంచిలో వేసుకుని ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డ సంఘటన శుక్రవారం రాత్రి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన హర్ష పటేల్ (21), కిషన్ పటేల్ (20) లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాలోని మని ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు కలిసి సికింద్రాబాద్ […]</p>

దిశ, జవహర్ నగర్: డబ్బు కట్టలు సంచిలో వేసుకుని ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డ సంఘటన శుక్రవారం రాత్రి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన హర్ష పటేల్ (21), కిషన్ పటేల్ (20) లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాలోని మని ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు కలిసి సికింద్రాబాద్ లోని సిటీ లైట్ హోటల్ వద్ద రూ.20 లక్షల హవాలా డబ్బులను తమ సైలో కారులో పెట్టుకుని బాటా షో రూమ్ రోడ్డు గుండా వెళ్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం ఎస్వోటీ పోలీసులు యాప్రాల్ కూడలి వద్ద పట్టుకుని, కారులో సోదాలు నిర్వహించారు. దీంతో సంచిలో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. ఇద్దరి యువకులతో పాటూ రూ.20 లక్షలను స్వాధీనం చేసుకుని జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






