దయచేసి ఈ సమయంలో ధర్నాలు, ర్యాలీలు చేయకండి : సీపీ

by  |
దయచేసి ఈ సమయంలో ధర్నాలు, ర్యాలీలు చేయకండి : సీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసులందరూ జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. శనివారం కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు, సానిటైజర్స్ ఉపయోగించాలని సూచించారు. ఈ సమయంలో ధర్నాలు, ఆందోళనలు, ముట్టడి లాంటి కార్యక్రమాలు చేయొద్దని రాజకీయ నేతలను కోరారు. అంతేగాకుండా.. ఎలాంటి మతపరమైన ర్యాలీల పెట్టుకోవద్దని అన్నారు. వివిధ కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలందరూ మాస్కు పెట్టుకొని రావాలని, శానిటైజర్ వాడుతూ, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కొవిడ్ హెల్ప్ లైన్ నెంబర్ 9490616780 ఉందని, ఏ అవసరమైనా వెంటనే కాల్ చేయొచ్చని తెలిపారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్న పోలీసులకు పబ్లిక్‌తో కాంటాక్ట్ అయ్యే డ్యూటీ కాకుండా ఆఫీస్ డ్యూటీ వేస్తున్నామని అన్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Next Story