- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యపై అనుమానం.. కత్తితో అక్కడ కోసి..
<p>దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ ప్రబుధ్దుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాహీన్(35), ఆసిఫ్ దంపతులు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే లారీ డ్రైవర్‌గా పనిచేసే ఆసిఫ్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. రోజు మద్యం తాగి వచ్చి షాహీన్‌తో గొడవపడుతుండేవాడు. అంతేకాకుండా షాహీన్‌కు అక్రమ సంబంధం ఉందనే అనుమానం ఉన్న ఆసిఫ్ తన కుమారుడిని […]</p>

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ ప్రబుధ్దుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాహీన్(35), ఆసిఫ్ దంపతులు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే లారీ డ్రైవర్‌గా పనిచేసే ఆసిఫ్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. రోజు మద్యం తాగి వచ్చి షాహీన్‌తో గొడవపడుతుండేవాడు. అంతేకాకుండా షాహీన్‌కు అక్రమ సంబంధం ఉందనే అనుమానం ఉన్న ఆసిఫ్ తన కుమారుడిని బ్యాంకు పని మీద పంపి, కూతురు స్నానం చేసేందుకు వెళ్లినప్పుడు ఇదే అదునుగా భావించి మధ్యాహ్నం 2 సమయంలో ఇంట్లో ఉన్న కత్తితో షాహీన్ గొంతు కోసం హతమార్చాడు. ఈ విషయంపై సమాచారం అందడంతో ఏసీపీ రహమాన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు ఆసిఫ్ ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.






