కేటీఆర్, ఎంపీ సంతోష్ రావులకు భారీ షాక్.. యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమైన HRC

by  |
ktr-and-santhosh-rao
X

దిశ ప్రతినిధి, వరంగల్ : మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు‌లకు భారీ షాక్ తగిలింది. కొద్దిరోజుల కిందట హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కేటీఆర్ అండ్ టీం మహబూబ్ నగర్ వెళ్లిన సమయంలో వీరికి ఘనస్వాగతం పలికేందుకు బలవంతంగా, బెదిరింపులతో అంగన్వాడీ మహిళా ఉద్యోగులను చాలా సేపు ఎండలో నిలబెట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ వారం రోజుల కిందట జాతీయ మానవ హక్కుల కమిషనర్‌‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదును హ్యుమన్ రైట్స్ కమిషనర్ కు విచారణకు స్వీకరించినట్లు బక్క జడ్సన్ ‘దిశ’కు ఫోన్ చేసి తెలిపారు. ఈ ఘటనలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుతో పాటు మహబూబ్ నగర్ కలెక్టర్‌లకు HRC నోటీసులు జారీ చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేయనున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వ్యూహం ఇదేనా..?



Next Story

Most Viewed