ఆ దేశాలకు వెళ్తున్నారా? అయితే అప్రమత్తంగా ఉండండి: కేంద్రం సూచన

by Swamyn |
ఆ దేశాలకు వెళ్తున్నారా? అయితే అప్రమత్తంగా ఉండండి: కేంద్రం సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లే భారతీయులను కేంద్రం అలెర్ట్ చేసింది. ఈ రెండు దేశాలకు ప్రయాణించే భారతీయులు అక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాణిజ్య విమానాల కోసం ఇరు దేశాలు తాజాగా తమ గగనతలాన్ని తెరిచిన సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంఈఏ) ఈ సూచన చేసింది. ‘‘ఇరాన్, ఇజ్రాయెల్‌లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాం. ఇరు దేశాలు వారి గగనతలాలను తెరిచాయని తెలిసింది. అయితే, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాల గగనతలాలు ఎప్పటివరకు తెరిచి ఉంటాయో చెప్పలేం. అందుకే, ఈ దేశాలకు వెళ్లే భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. అక్కడి భారత ఎంబసీలతో టచ్‌లో ఉండండి’’ అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. కాగా, గత నెలలో ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడులు చేయగా, వాటిని ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే, తమ దేశంపై దాడికి యత్నించడంతో ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.



Advertisement

Next Story

Most Viewed