మీ ఫోన్ పోయిందా.. Google pay, Phone Pay, Paytm అకౌంట్ బ్లాక్ చేయడం ఎలా.?

by  |
payment-apps
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపుగా ఆన్‌లైన్ పేమెంట్స్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం ప్రతీ ఫోన్‌లో డిజిటల్ పేమెంట్ యాప్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్‌తో(యూపీఐ) అనుసంధానమై పనిచేసే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ మీ ఫోన్‌లో ఉండాల్సిందే. అయితే, ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకవేళ మీరు మీ ఫోన్ పొగొట్టుకుంటే ఎలా.? ఇలాంటి సందర్భాల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్స్‌లోని డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. తెలుసుకోండి ఇలా..

Google pay అకౌంట్‌ను బ్లాక్ చేయడం ఎలా..?

Google pay యూజర్స్ హెల్ప్‌లైన్ నెంబర్ 1800 4190 157కు కాల్ చేయాలి. అనంతరం మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేసేందుకు నిపుణులతో మాట్లాడే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ‘రిమోట్ వైప్’ ద్వారా సంబంధిత యాప్‌లో ఉన్న వారి డేటాను రిమూవ్ చేసుకోవచ్చు.

Phone Pay అకౌంట్‌ను ఎలా బ్లాక్ చేయాలి..?

Phone Pay యూజర్స్ 0806 8727 374 లేదా 0226 8727 374కు కాల్ చేసి వివరాలను తెలపవచ్చు. మీకు నచ్చిన భాషను ఎంచుకున్న అనంతరం.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోవాలి. నెంబర్ కన్ఫర్మేషన్ కోసం సంబంధిత ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అయితే, ఓటీపీ రాలేదనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. సిమ్/మొబైల్ పోయినట్లు చూపించే ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఫోన్ నంబర్, Scanner ద్వారా చేసిన చివరి చెల్లింపు/లావాదేవీ విలువ వంటి వివరాలను అడుగుతుంది. అనంతరం మీ అకౌంట్ బ్లాక్ చేసేందుకు సంస్థ నిపుణులు అందుబాటులోకి వస్తారు.

Paytm అకౌంట్‌ను బ్లాక్ చేయడం ఎలా.?

Paytm హెల్ప్‌లైన్ నంబర్ 012 0445 6456కు కాల్ చేసి.. ‘ఫోన్ లాస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం కొత్త నెంబర్ ​నమోదు ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు పోగొట్టుకున్న ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి. ‘లాగ్ అవుట్ ఫ్రం’ ఆల్​డివైసెస్‌ను ఎంపిక చేసుకోవాలి. Paytm వెబ్‌సైట్‌కు వెళ్లి 24 గంటల సహాయాన్ని ఎంచుకోండి. ‘రిపోర్ట్ ఏ ఫ్రాడ్’ లేదా మరే కారణంపైన అయినా క్లిక్ చేయండి.

ఇంకేమైనా చెప్పాలనుకుంటే.. ‘ఎనీ ఇష్యూ’పై క్లిక్ చేసి సంస్థకు మెసేజ్ చేయాలి. Paytm అకౌంట్ లావాదేవీలను ధ్రువీకరించే డెబిట్/క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను సమర్పించాలి. అలాగే ఫోన్ పోగొట్టుకున్న వివరాలకు సంబంధించిన నిర్ధారణను ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలు పూర్తైన తరువాత Paytm మీ ఖాతాను ధ్రువీకరించి బ్లాక్ చేస్తుంది. అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.



Next Story

Most Viewed