త్వరపడండి.. బంగారు రుణాలపై SBI ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్..

by  |

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బంగారంపై రుణాలు తీసుకునేవారికి ప్రత్యేక ఆఫర్‌ను ఇస్తోంది. ఎస్‌బీఐ బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకునేందుకు వడ్డీ రేట్లపై రాయితీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ రుణాల వడ్డీ రేట్లపై 0.75 శాతం రాయితీని ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎస్‌బీఐ గోల్డ్ లోన్‌లపై వడ్డీ రేట్లు 7-29 శాతం మధ్య ఉంది. ఎస్‌బీఐ అందించే ఈ గోల్డ్ లోన్‌ను యోనో యాప్ ద్వారా తీసుకున్నవారికి రాయితీ అందిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. తక్కువ ప్రాసెసింగ్ సమయంతో పాటు తక్కువ పేపర్ వర్క్ కలిగిన గోల్డ్ లోన్‌ను యోనో ద్వారా పొందే అవకాశం ఉందని ఎస్‌బీఐ పేర్కొంది.

కొవిడ్ మహమ్మారి పరిస్థితుల తర్వాత ఎక్కువమంది ఖాతాదారులు గోల్డ్ లోన్‌పై ఆధారపడుతుండటం గుర్తించామని, ఇటీవలి కాలంలో ఈ రకమైన రుణాలు గణనీయంగా పెరిగాయని బ్యాంకు ఓ ప్రకటనలో వివరించింది. కాగా, యోనో యాప్ నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడానికి యాప్‌లో లోన్ విభాగంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డ్ లోన్ విభాగంలో అప్లై చేసిన తర్వాత ఆభరణానికి సంబంధించిన వివరాలు, ఇంకా ఇతర వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బంగారంతో స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించాలి. తాకట్టు పెట్టే బంగారంతో పాటు ఫోటోలు, కేవైసీ పత్రాలను ఇవ్వాలని బ్యాంకు వెల్లడించింది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed