కరోనా.. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తీసుకొస్తుందా?

by  |
కరోనా.. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తీసుకొస్తుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా కారణంగా ఇప్పటికే పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అకాడమిక్ షెడ్యూల్ లేదా క్యాలెండర్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. వచ్చే విద్యా సంవత్సరం ఎలా ఉండబోతోందన్న సందేహం కూడా చాలా మంది విద్యార్థుల్లో ఉంది. ఆ విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల .. రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని పాఠశాలలు, కాలేజీలు టెక్నాలజీ అందిపుచ్చుకుని పాఠాలు బోధిస్తున్నాయి. అయితే చాలా వరకు నగర, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? అసలు ఆన్ లైన్ క్లాసులు సాధ్యమయ్యే పనేనా?

మనదేశంలో చాలా వరకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు. పేదల సంఖ్య వీరికి మించి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే పరిస్థితి ఉంటుందా? అంటే కష్టం కాకపోయినా.. అందులోని కొన్ని అడ్డంకలు దాటగలిగితే.. డిజిటల్ ఎడ్యుకేషన్ సాధ్యమయ్యే అవకాశం లేకపోలేదు.

1. కనెక్టివిటీ :

ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలంటే.. ఉపాధ్యాయులకు, అదే విధంగా విద్యార్థులకు వారి వారి ఇళ్లలో తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అంతేకాదు ‘క్వాలిటీ ఆఫ్ కనెక్టివిటీ’ కూడా చాలా ముఖ్యం. బ్రాడ్ బ్యాండ్, వైఫై ఏదీ ఉపయోగించినా వీడియో లో డిస్టర్బెన్స్ ఉండకూడదు. క్లారిటీ తో పాటు క్వాలిటీ కూడా ఉండాలి. ట్యూషన్ ఫీజులు, ఇతరత్రా ఫీజులతో పాటు, పుస్తకాలు, నోటు బుక్కులు ఖర్చులతోనే సతమతమయ్యే సగటు భారతీయులు … ఇంటర్నెట్ కనెక్షన్ కు డబ్బులు వెచ్చించగలరా? అంతా స్తోమత అందరి దగ్గర ఉండకపోవచ్చనేది విశ్లేషకుల మాట.

2. యాక్సెసిబిలిటీ :

ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందా? విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దాన్ని కనెక్ట్ చేసే డివైజ్ లు ఉండాలి కదా. ల్యాప్ టాప్స్ లేదా డెస్క్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ వీటిలో ఏదో ఒక డివైజ్ మాత్రం తప్పకుండా కావాలి. మరి మన దేశంలో చాలా మంది ప్రజలకు ఇది కూడా తలకు మించిన భారమేనన్నది జగమెరిగిన సత్యం.

3.కెపాసిటీ :

ఉపాధ్యాయుడు క్లాసులో పాఠం చెబుతున్నప్పుడు విద్యార్థులందర్నీ పరిశీలిస్తుంటారు. ఎవరు ఎంత కాన్సెంట్రేషన్ తో పాఠం వింటున్నారో కనిపెట్టగలుగుతారు. అదే ఆన్ లైన్ క్లాసుల్లో ఈ విధమైన ఆబ్జర్వేషన్ ఉండదు. త్వరగా గ్రాస్పింగ్ చేసి విద్యార్థులు ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నప్పుడు వెంటనే విని అర్థం చేసుకోగలుగుతారు. కాస్త యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం ఆన్ లైన్ పాఠాలు వినడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఉపాధ్యాయులతో కూడా సరైన ఇంటారాక్షన్ ఉండదు కాబట్టి, వాళ్లు కూడా యావరేజ్ స్టూడెంట్స్ పై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం కష్టమైన పని.

ఇప్పటికే నగర, పట్టణ ప్రాంతాల్లోని ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్స్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. మన భారత దేశంలో గత కొన్ని సంవత్సరాల నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. పట్టణాలను దాటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు, పల్లెలకు ఈ తరహా డిటిజల్ ఎడ్యుకేషన్ సేవలు రావాలంటే.. పైన చెప్పిన యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం ఆన్ లైన్ బ్యారికేడ్స్ దాటాల్సిన అవసరం ఉందన్నది విద్య నిపుణులు చెబుతున్న మాట.

tags :online clases, digital education, internet , wifi


Next Story