ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?

by Disha Web Desk 8 |
ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?
X

దిశ, ఫీచర్స్ : ఉగాది పండుగ వచ్చేస్తోంది.ఇది తెలుగు వారికి ఎంతో ఇష్టం. తెలుగు నూతన సంవత్సరంగా పిలిచే ఉగాది చైత్ర మాసంలో షడ్రుచుల పచ్చడితో ప్రారంభం అవుతుంది. అయితే ఈరోజు ప్రజలందరూ కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవాన్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. అంతే కాకుండా ఈరోజు అందరూ ఒకే చోట కూర్చొని పంచాంగ శ్రవణం వింటుంటారు. ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది. ఏ రాశికి ఈ ఏడాది అనుకూలంగా ఉందో తెలుసుకుంటారు. కాగా, అసలు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహాపర్వదినాలైన కల్పాది తిథులు, మన్వంతర తిథులు, దశావతార పుణ్య తిథులు మొదలైనవి ఉంటాయి. అలాగే పంచాంగం అనేది ఐదు అంగాల కలియక.తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ మొదలైన 5 అంగములను పంచాంగం అంటారు. దీని ద్వారా భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు, పండుగలు, గ్రహణాలు, వర్ష వివరాలు, కాల నిర్ణయాలు, ఆ సంవత్సరంలో సాగే ధరవరలు, వర్షపాతములు మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుందని పండితులు చెబుతారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఆరోజున, సంవత్సర కాలం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు, ఆరోజు పంచాగ శ్రవణం వినడం చాలా మంచిదంట.అలాగే భవిష్యత్తను మనకు తెలియజేసే గ్రంధమే కాకుండా దీని వెనుక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉందంట. శ్రీ మహావిష్ణువు అయిన కాల పురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. భగవంతుని కాలాన్ని లేదా కాలపురుషుడి ని ఆరాధించడం అంటే ఆయనకు నివాళులు అర్పించినట్లే. అంతే కాకుండా మనం రాబోయే సంవత్సరంలో ఎదుర్కొనే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి. కష్టసమయం వస్తుంది అని తెలియగానే కుంగిపోకుండా ఎలా బలంగా ఉండాలి అనేది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు.


Next Story

Most Viewed