Today's horoscope(05-04-2026): నేటి రాశి ఫలాలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-05 17:58:59  IST  )

ఈ రాశి వారికి కొత్త బాధ్యతలు పెరుగుతాయి.

Todays horoscope(05-04-2026): నేటి రాశి ఫలాలు
X

మేష రాశి

ఈ రాశి వారికి కొత్త బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభ రాశి

ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ రోజు వ్యాపారస్తులకు అనుకూల సమయం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్య చర్చలు జరుగుతాయి.

మిథున రాశి

ఈ రాశి వారికి వృత్తిపరంగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి మద్దతు మీకు ధైర్యన్నిస్తుంది.

కర్కాటక రాశి

నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

సింహ రాశి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. మౌనం పాటించడం మేలు.

కన్య రాశి

పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. కొత్త సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వైవాహిక బంధం బలపడుతుంది.

తుల రాశి

పని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బద్ధకాన్ని వదలండి. పెళ్లి సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి

వ్యాపారంలో పెట్టుబడులకు మంచి రోజు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. బహుమతులు అందుకుంటారు.

ధనుస్సు రాశి

కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ప్రశంసలు లభిస్తాయి.కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సర్దుమణిగి, వివాహ చర్చలు సాగుతాయి.

మకర రాశి

కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. పనులు సకాలంలో అవుతాయి.వివాహ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

కుంభ రాశి

ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. స్థిరాస్తి సంబంధిత పనుల్లో లాభాలు ఉంటాయి. కెరీర్‌లో మార్పు కనిపిస్తుంది. అవివాహితులకు సంబంధం నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది.

మీన రాశి

ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. అధికారుల మద్దతు ఉంటుంది. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

Read more.. ఆ రాశుల వారికి ఉద్యోగంలో అనుకోని సవాళ్లు

Next Story