Today's horoscope(14-02-2026): ఈ రోజు రాశి ఫలాలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-14 03:13:54  IST  )

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈరోజు(శనివారం) గ్రహ సంచారం కారణంగా రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

Todays horoscope(14-02-2026): ఈ రోజు రాశి ఫలాలు
X

మేషరాశి

ఈ రాశికి చెందిన వారు ఏ రంగంలో ఉన్నా సరే ఈ రోజు శుభవార్తలు వింటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. దీంతో మీరు మరింత ముందుకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా బాగుంది. మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

వృషభ రాశి

ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొంత కాలం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో సానుకూల దృక్పథంతో కొనసాగండి. పదోన్నతి తో కూడిన స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు. అనుకోని ఖర్చులు వల్ల ఆర్థికంగా నష్టపోతారు.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశివారికి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. దీంతో వారి జీవితంలో అనుకోని మార్పులు సంభవిచ్చు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజు. పట్టుదలతో ముందుకు వెళితే విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇతరులకు సహాయం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది.

సింహ రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. దీంతో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక విషయంలో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వైవాహిక జీవితం బాగుంటుంది.

కన్య రాశి

ఆర్థిక పరిస్థితి బాగుంది. ఏ రంగంలో ఉన్న ఉద్యోగులకైన ఇవాళ ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పనిభారం, ఒత్తిడి తగ్గుతాయి. ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాల వల్ల ఆశించిన ప్రయోజనం పొందుతారు.

తుల రాశి

వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. మిత్రులకు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆలోచనలకు, ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం

వృశ్చిక రాశి

అధికారులు కొత్త బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. సొంత విషయం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

మకర రాశి

ఉద్యోగులకు ఆఫీస్ లో బాగా కలిసి వస్తుంది. నూతన ఆలోచనలకు అనుకూల సమయం. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కుంభరాశి

అదృష్ట యోగం ఉంది. ఉద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్స్ అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది.

మీనరాశి

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ పెద్ద ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Next Story