Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు(04/11/2025)

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-03 23:31:00  IST  )

ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు(04/11/2025)
X

మేష రాశి

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగించగలదు. స్నేహితులతో రోజంతా ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి

ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదు. ఆర్థికంగా బాగుంటుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించు కోవలసిన రోజు. ఈ రోజు ఆఫీస్ లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది.

మిథున రాశి

కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఉద్యోగాస్తులకు ఆఫీస్‌లో ఒత్తిడి పెరుగుతుంది. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. దీంతో రోజంతా అసంతృప్తికి గురవుతారు. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.

కర్కాటక రాశి

ప్రయాణంలో ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. మొండిగా ఏ పనిని చేయోద్దు. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాలు వినండి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

సింహ రాశి

మీరు సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు పొందగలరు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గ్రహాలు , నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన ,మీకు ధనలాభం లో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును.

కన్యా రాశి

మీ వేగవంతమైన స్వభావం, మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే, కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకోండి. స్నేహితులతో బయటకు వెళ్లడం మీ మనస్సుకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. విలువైన పత్రాలపై సంతకం చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

తులా రాశి

ఈ రోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని వల్ల వారికి ఉత్సాహం కలుగుతుంది. ఈ రోజు మీరు పనిచేసే ఆఫీస్‌లో సహఉద్యోగులు సపోర్ట్ అందుతాయి. ఈ రోజు ప్రయాణాలకు అంత మంచిది కాదు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు నెగటివ్ ఫీలింగ్స్ తో ఉండకూడదు. ఎవరైనా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో ఆనందంగా గడపండి. చిన్నప్పటి జ్నాపకాలను గుర్తు చేసుకుంటారు.

ధనుస్సు రాశి

ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఓపికతో ఉండడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. లేనిచో మీయొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న గొడవలు ఈరోజుతో సమసిపోతాయి.

మకర రాశి

ఆర్థికంగా బాగుంటుంది. జీవితం పట్ల అతి ఆలోచనలు మంచిది కాదు. మీ ఇంటికి బంధువులు వస్తారు. దీంతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు ఉత్తమ మార్కులు సాధిస్తారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది.

కుంభ రాశి

వైవాహిక జీవితం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో తండ్రి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. చిల్లర వ్యాపారులకు, టోకు వ్యాపారులకు మంచి రోజు. సంఘటనలు, మీకు అనుకూలంగా ఉండేలా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు.

మీన రాశి

మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. తోబుట్టువుల యొక్క సహాయసహకారాలు వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆఫీసులో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఎంతగానో దోహదపడతాయి. మొత్తానికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది.

Next Story