Today's Horoscope:ఈ రోజు రాశి ఫలాలు(03-11-2025)

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-02 23:30:55  IST  )

ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి. నాలుగు రాశుల వారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Todays Horoscope:ఈ రోజు రాశి ఫలాలు(03-11-2025)
X

మేష రాశి

ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. అయితే.. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు అనుకూలంగా లేవు. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రోజు ఒంటిరిగా ఉండటానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది.

వృషభ రాశి

ఈ రోజు ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల అవసరాలు, మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులు సపోర్టివ్ గా ఉంటారు. విలువైన పత్రాలపై సంతకం చేసే ముందు ఆలోచించండి.

మిథున రాశి

ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంది. విద్యార్థులు చదువులో రాణించగలరు.

కర్కాటక రాశి

ఈ రోజు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపం, ద్వేషాలకు దూరంగా ఉండండి. అందరితో కలుపుగోలుగా ఉంటే మంచి జరుగుతుంది. లేకపోతే విచారించాల్సి వస్తుంది. నిరాశకు గురిచేస్తుంది. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చు.

సింహ రాశి

ఈ రోజు ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఎంతో శక్తిసామార్ధ్యాలు గలవారు. అయినా ఈ రోజు అధిక పని ఒత్తిడి వల్ల చిరాకు వస్తుంది. ఈ రోజు అందరితో ఆనందంగా గడపడానికి గతంలో చేసిన తప్పులను మన్నిస్తారు. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. మీయొక్క వ్యక్తిత్వపరంగా ఎక్కువ మందిని కలుసుకుంటారు. వైవాహిక జీవితం బాగుంది.

కన్య రాశి

ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం. తెలివిగా చేసిన మదుపులే లాభంగా తిరిగి వస్తాయి. ఈ రోజు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. దీంతో సంతోషం కలుగుతుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

విహార యాత్రలకు వెళ్లి ఆనందంగా గడపాలని ఆలోచిస్తుంటారు. వీరి కుటుంబంలో కొత్త వ్యక్తి రావటంతో ఆనందంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి

ఆర్థికంగా కలిసివస్తుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. మీరు పదిమందిలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడటం ఉత్తమం. లేదంటే సమస్యలో చిక్కుకుంటారు. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు ఫీల్ అవుతారు. దగ్గరి వారితో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో మానసిక అసంతృప్తికి లోనవుతారు.

ధనుస్సు రాశి

మీరు చేసిన ఓ పనికి మీ స్నేహితుడి ప్రశంసిస్తాడు. ఇది మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తున్నట్లయితే ఆలోచించండి. ఆఫీస్ లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. ప్రయాణాలకు ప్లానింగ్ వేసుకున్నట్లయితే అవి విఫలం అవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.

మకర రాశి

మీ స్నేహితులతో కొత్త సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. డబ్బును పొదుపు చేయాలనే ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు చదువులో రాణించడానికి ఇదే మంచి సమయం. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పడటంతో నిరాశకు గురవుతారు.

కుంభ రాశి

ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్టివ్ గా ఉంటారు. పిల్లల చదువుకు సంబంధించిన విషయాలలో ప్రత్యేక దృష్టి పెట్టండి.

మీన రాశి

మీ ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వైద్యులను సంప్రదించడం మంచిది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు అనుకూలంగా లేవు.

Next Story