- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today's Horoscope:ఈ రోజు రాశి ఫలాలు(02-11-2025)
ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

మేష రాశి
ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతారు. కొంత ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. డబ్బును అతిగా ఖర్చు చేయడం వల్ల కొంత నష్టం కలగక తప్పదు. మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు. కానీ మీరు వాటిని పట్టించుకోరు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
వృషభ రాశి
ఈ రోజు ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. శుభవార్త వింటారు. ఇది మీ కుటుంబంలో మరింత సంతోషం తెస్తోంది. మీ ఆఫీస్ లో పనిలో పూర్తి చేయకపోవడం వల్ల పై అధికారులు ఆగ్రహానికి గురవుతారు. వైవాహిక జీవితం బాగుంది. మీ భవిష్యత్తు ప్రణాళికకు ఇది మంచి సమయం.
మిథున రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్ కి వెళతారు. మీ ప్రవర్తన పై జీవిత భాగస్వామి అసంతృప్తి వ్యక్తం చేస్తాడు.
కర్కాటక రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు విచారంగా గడుస్తోంది. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే ఆలోచనలో ఉంటారు. కానీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే, అనుకోని ప్రయాణం కొంతమందికి ఒత్తిడిని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగం రావడం కష్టం. కాబట్టి మీరు మరింత కష్టపడి పనిచేయడం వలన మీరు మంచి ఫలితాలు అందుకుంటారు.
కన్యా రాశి
పనిచేసే చోట సీనియర్ల నుంచి, ఇంట్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మీకు చిరాకు తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే. సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది.
తులా రాశి
మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ స్నేహితుల ద్వారా, ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామి తో కలిసి గడపడం చాలా ముఖ్యం. మీ కుటుంబము మిమ్ములను అర్థం చేసుకోవట్లేదని భావిస్తారు. అందువలన మీరు వారికి దూరంగా, తక్కువ మాట్లాడతారు.
వృశ్చిక రాశి
ఈరోజు మీయొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. మీయొక్క వ్యక్తిత్వము ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీరు మీయొక్క పాత స్నేహితుడిని కలుసుకుంటారు.
ధనుస్సు రాశి
మీ ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు. ఈ రోజు మీ తెలివిగా ఇంట్లోని సమస్యలు పరిష్కరిస్తారు. ఇది కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.
మకర రాశి
ఈ రోజు తోటి వారితో సరదాగా గడపండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. డబ్బు విలువ తెలుసుకుంటారు. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీ సమాచార, పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు అనుకూలంగా ఉంది. డబ్బు విలువ తెలుసుకుంటారు. ఖర్చులు తగ్గిస్తారు. కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వాదానికి దిగుతారు. ఇది మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. ఈరోజు మీకు బాగా కావాల్సిన వారు మిమ్ములను మీ సంతోషం కోసం ప్రయత్నం చేస్తారు.
మీన రాశి
ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు రావొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో తగవులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. చదువు పై మరింత శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.






