- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 27-02-2025)
ఈ రోజు రాశి ఫలాలు ( 27-02-2025)

మేష రాశి : ఈ రోజు బయట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా, అలాగే మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. లేదంటే కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయి. డబ్బు ఉందని ఎక్కువ ఖర్చు చేయకండి. అవసరమైన సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వారు మీ మీద అలుగుతారు.. అయినా మీరు చేయాలనుకున్న పనిని మాత్రం ఆపకండి.
మిథున రాశి: ఈ రాశి వారు బయట ఫుడ్స్ తినకపోవడమే మంచిది. లేదంటే పొట్ట సమస్యలు ఎక్కువవుతాయి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి మంచిగా గడుపుతారు. అలాగే, ఖర్చులు కూడా ఎక్కువ పెట్టకండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు జేబులో డబ్బు జాగ్రత్త .. లేదంటే ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
కర్కాటక రాశి: స్నేహితులను కలుసుకుని కొత్త వ్యాపారాలను మొదలు పెట్టాలనుకుంటారు. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : ఈ రోజు ప్రారంభం కలిసి రాదు.. కానీ, సాయంత్రానికి వాతావరణం మారుతుంది. మీ తోటి ఉద్యోగులు మీరు చేసే పనిని మెచ్చుకుంటారు. మీ స్నేహితులకు ఏమైనా సీక్రెట్స్ చెప్పేటప్పుడు ఒకటికి, రెండు సార్లు అలోచించి చెప్పండి. ఈ రోజు మీరు బంధాల యొక్క విలువను తెలుసుకుంటారు.
కన్యా రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. గ్రహాన్ని బట్టి ఎవరైనా మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.
తులా రాశి: అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే, కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు సాయంత్రం మీ ప్రియురాలితో గడుపుతారు. ఆఫీసులో ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీ జీవిత భాగస్వామికి చెప్పి చేయండి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
ధనస్సు రాశి : ఫైనాన్స్ మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. మీరు మీ ఆర్థిక, ఆదాయం గురించి కుటుంబ సభ్యుల దగ్గర నిజాయితీగా ఉండాలి. మీరు బాగా అభివృద్ధి చెందితే, మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది.
మకర రాశి: ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.
కుంభ రాశి: ఈ రోజు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. మీరు వెతుకుతున్న కలల రాణి కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి సారే ప్రేమలో పడతారు. మీతో మీరు ఎక్కువ సమయం గడపండి. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మీన రాశి: ఈ రోజు మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.






