- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope: నేటి రాశి ఫలాలు (25-02-2026)
ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి: ఇవాళ ఆర్థికంగా పుంజుకుంటారు. కానీ మీ ప్రవర్తన తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తుంది. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తారు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. చిన్న విషయాలకే ఎక్కువ ఆందోళన చెందవద్దు. శారీరకంగా ధృడంగా ఉంటారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.
వృషభ రాశి: ఎవరితో అయినా అన్ని విషయాలు చెప్పుకోవడం మంచిది కాదు. మీ మాటలతో మిమ్మల్ని ఇతరులు బాధ పెట్టవద్దు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఫలితం దక్కుతుంది. ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. మానసికంగా ఆందోళన చెందుతారు. ఇంటికి చుట్టాలు వస్తారు. మీ భర్త మీపై ఎనలేని ప్రేమ కురిపిస్తారు.
మిథున రాశి: నేడు ఇంట్లో కార్యక్రమాలకు మంచి రోజు. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తుంటారు. విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయిస్తారు.
కర్కాటక రాశి: నేడు దూరపు చుట్టాలు వస్తారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. కార్యక్రమాలకు మంచి రోజు. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
సింహ రాశి: పార్క్‌కు వెళ్తారు. ఎక్కువగా సాంగ్స్ వింటారు. మీ భాగస్వామితో బయటికి వెళ్తారు. డబ్బు పరంగా కాస్త నష్టపోతారు. ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మొదలుపెట్టడం మేలు.
కన్యా రాశి: ప్రారంభించిన పనులు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో బయటికి వెళ్తారు. పురుషులు ఆఫీసులో ప్రశంసలు పొందుతారు. తోటివారితో గొడవలు పెట్టుకోకూడదు. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే చాన్స్ ఉంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు.
తులా రాశి: ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చిక రాశి: ఖర్చులు ఎక్కువగా పెట్టకూడదు. నేడు సోదరీమణులతో సినిమాకు వెళ్తారు. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ధనుస్సు రాశి: అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే చాన్స్ ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
మకర రాశి: ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవ్వకూడదు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం మేలు. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి.
కుంభ రాశి: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లాభాలు పొందుతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా ఫ్యామిలీలో కలహాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. శుభవార్తలు వింటారు. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.
మీన రాశి: ఆర్థిక ఇబ్బందులను దూరమవుతాయి. మునపటి అనారోగ్య సమస్యల వల్ల బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరులకు హాని తలపెట్టే పనులకు చేయకూడదు. మీ భాగస్వామితో నేడు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతారు.






