ఉగాది పంచాంగం : ఈ ఏడాది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే, కానీ..

by Disha Web Desk 8 |
ఉగాది పంచాంగం :  ఈ ఏడాది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే, కానీ..
X

తుల రాశి : తుల రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది. ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం.

ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5

ఫలితాల విషయానికి వస్తే : ఈ సంవత్సరం తుల రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎనిమిదో స్థానంలో గురుసంచారం,రాహు, కేతువులు కూడా శుభ స్థానంలో ఉండడం వల్ల గతేడాది కంటే ఈ ఏడాది పట్టిందల్లా బంగారం కానుంది. ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది, అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారు చిన్న చిన్న అవమానాలు, అపనిందలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శించడం, ఇంట్లో శుభకార్యాలు చేయడం లాంటివి చేస్తారు. ఈ సంవత్సరం అంతా బానే ఉంది కానీ, అష్టమం లో గురు సంచారం వలన కాస్త కుటుంబం పరంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది.

ఇక ఈ సంవత్సరం తుల రాశి వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మంచి గుర్తింపు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా ఈ రాశి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం అంతగా కలిసి రాదని చెప్పవచ్చు. వీరికి గురుబలం లేనందున జ్ఞాపక శక్తి తగ్గడమే కాకుండా,పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు కూడా మంచి ర్యాంకులు పొందలేరు. రియలెస్టేట్ వారికి పర్వాలేదు. ఈ సంత్సరం క్రీడాకారులకు బాగుంది.

Read More..

ఏప్రిల్ 8 న మొదటి సూర్యగ్రహణం.. ఆ రోజున ఈ ఒక్క రాశి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది!

Next Story

Most Viewed