- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope(08-04-2026): నేటి రాశిఫలాలు
ఏప్రిల్ 8 వ తేదీన మీ రాశి ఎలా ఉందో చూసుకోండి...

మేష రాశి: నేడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి.. కానీ మీ ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. ఆఫీసులో కొంత నిరాశకు గురి అవుతారు. చిన్న విషయాలకే ఎక్కువ ఆందోళన చెందుతారు. శారీరకంగా బలహీనులవుతారు. ప్రశాంతత కోసం బయటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.
వృషభ రాశి: అనవసరమైన మాటలతో మిమ్మల్ని ఇతరులు బాధ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఫలితం దక్కుతుంది. ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. కానీ మానసిక ఆందోళనతోనే కాలం గడపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మిథున రాశి: నేడు ఇంట్లో కార్యక్రమాలకు మంచి రోజు అలాగే. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయిస్తారు.
కర్కాటక రాశి: ఇవాళ దూరపు చుట్టాలు వస్తారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
సింహ రాశి: పార్క్ కు వెళ్లి ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడుతారు. ఎక్కువగా పాటలు వింటారు. మీ భాగస్వామితో నేడు అన్ని విషయాలు పంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. డబ్బు పరంగా కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
కన్యా రాశి: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
తులా రాశి: ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చిక రాశి: ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ధనుస్సు రాశి: అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
మకర రాశి: ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.
కుంభ రాశి: విదేశాలకు వెళ్లేందుకు మంచి రోజు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.
మీన రాశి: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇతరులకు హాని తలపెట్టే పనులకు దూరంగా ఉంటారు. మనోదైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. కొత్త పనులకు ఆటంకాలేర్పడతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని సహనంగా ఉంటే మంచిది. మీ దురుసుతనం వల్ల ఇతరులు ఇబ్బందులను ఎదుర్కొంటారు.






