- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope(07-04-2026): నేటి రాశిఫలాలు
ఏప్రిల్ 7 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి: ఇవాళ మీ మానస్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా ఎగ్జైటింగ్ విషయాలు వింటారు. ఆర్థికపర విషయాల్లో మీరు మీ భాగస్వామితో చిన్న వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఏదైనా ల్యాండ్ విషయాల్లో సంతకాలు పెట్టేముందు బాగా ఆలోచించాలి. ఇవాళ పాత మిత్రుల్ని కలుస్తారు. నేడు నేడు పెద్దల సలహాలు ఎక్కువగా తీసుకుంటారు.
వృషభ రాశి: ఎక్కువగా బయట పనుల్లోనే నిమగ్నమవుతారు. గతంలో చేసిన తప్పులకు బాధపడుతారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రేమ మీ వద్దకు వస్తుంది. ఆర్థికంగా అంతా బాగుంటుంది. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఏళ్ల నాటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు నేటితో చెక్ పెడుతారు.
మిథున రాశి: ఆఫీసులో ప్రశంసలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా సాంగ్స్ వింటారు. నేడు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. పెద్దవారి సలహాలు పొందుతారు. శుభకార్యాలకు అటెండ్ అవుతారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. మీ భాగస్వామి నేడు మీతో అన్ని విషయాలు చెప్పుకుంటారు.
కర్కాటక రాశి: మీరు చేసే పనులు మీకు చాలా ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. ఇతరులకు సాయం చేస్తారు. చాలా కష్టపడి పని చేస్తారు. అనుకోకుండానే ఖర్చులు పెరుగుతాయి. మీ భాగస్వామి తనలోని మరో కోణాన్ని చూపిస్తారు.
సింహ రాశి: చిన్న విషయాలకే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. పార్క్ కు వెళ్తారు. పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన మీలో కలుగుతుంది. మీ మాటలతో ఇతరులు మీ తెలివిని అంచనా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కన్యా రాశి: ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీ పనులు అన్ని సజావుగా సాగుతాయి. ఇతరులకు సహాయం చేసేందుకు కూడా ముందడుగు వేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
తులా రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. వ్యాపారవేత్తలకు ఇవాళ పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఉద్యోగం విషయాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషం నెలకుంటుంది. నేడు రోజంతా నవ్వుకుంటూ ఉంటారు. భాగస్వామితో ఎక్కువగా టైమ్ సస్పెండ్
వృశ్చిక రాశి: ఎక్కువగా ఫోన్ లో నిమగ్నమవుతారు. నేడు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. యోగా చేస్తారు. శారీరకంగా స్ట్రాంగ్ ఉండేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా స్ట్రెస్ కు గురి అవ్వకూడదు. పక్కవారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడుతారు. ఉద్యోగ రంగాల్లో ప్రశంసలు అందుకుంటారు. మీ భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: కొత్త మార్గంలో నడుస్తారు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. నేడు ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. చిన్న విషయాలకే ఆందోళన చెందవద్ద అక్కాచెల్లెల్లతో బయటకు వెళ్తారు.
మకర రాశి: ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్నేహితులతో కలిసి బయటకెళ్తారు. పెద్దల సలహాలు తీసుకుంటారు. మీ ఆనందాన్ని సహోద్యోగులతో పంచుకుంటారు. ఎక్కువగా రెస్ట్ తీసుకునేందుకు ఇష్టపడుతారు. శుభవార్తలు వింటారు. మీ భాగస్వామి వర్క్ స్ట్రెస్ వల్ల మీపై కాస్త అరుస్తారు.
కుంభ రాశి: ఏ ఆలోచన పట్ల స్థిరంగా ఉండలేకపోతారు. ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. ఆలస్యమైనా ఫలితం కచ్చితంగా ఉంటుంది. మీ జీవితంలో అద్భుతమైన వ్యక్తుల్ని కలుస్తారు. మీ మాటలు ఇతరులు బాధపెడుతాయి. కాగా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. దీర్ఘకాలికవ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు.
మీన రాశి: ఎంత బిజీబిజీగా ఉన్నా కూడా అలసటు చాలా ఈజీగా జయిస్తారు. నేడు ఎవరికీ అప్పు ఇవ్వడం మంచిది కాదు. మీ భాగస్వామి మీ సంతోషం కోసం ఏమైనా చేస్తారు. ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. అనారోగ్యం కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటారు. మొక్కలు నాటేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు.






