రూ. 30 వేలకు పైగా డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్న హోండా..

by  |
రూ. 30 వేలకు పైగా డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్న హోండా..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 33 వేలకు పైగా లబ్దిని వినియోగదారులు పొందుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ అమేజ్, జాజ్, డబ్ల్యూ-ఆర్ మోడళ్లకు వర్తిస్తుందని, మోడల్ వేరియంట్‌ని బట్టి వీటి ఆఫర్ మొత్తంలో తేడా ఉంటుందని హోండా ఇండియా ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 30 వరకు ఉండనున్నట్టు పేర్కొంది.

అధికంగా అమేజ్ సెడాన్ మోడల్‌, ఎస్ఎంటీ పెట్రోల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ. 33,496 డిస్కౌంట్ హోండా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్ కింద రూ. 15 వేలు, ఎక్స్ఛేంక్ బోనస్‌గా రూ. 15 వేలు, అలాగే వినియోగదారులు క్యాష్ డిస్కౌంట్ వద్దనుకుంటే రూ. 18,496 విలువైన యాక్సెసరీస్ పొందే అవకాశం ఉంటుంది. హోండా జాజ్ ప్రీమియం హాచ్‌బ్యాంక్ మోడల్‌పై రూ. 21,908 డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 10 వ్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌గా మరో రూ. 10 వేలు వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ వద్దనుకునే వినియోగదారులకు రూ. 11,998 విలువైన యాక్సెసరీస్ కంపెనీ ఇస్తోంది. మరో మోడల్ హోండా డబ్ల్యూఆర్-వీపై రూ. 22,158 డిస్కౌంట్ కంపెనీ అందిస్తోంది.

Next Story