‘హోలా చికా’ అంటున్న బెల్లంకొండ

by  |
‘హోలా చికా’ అంటున్న బెల్లంకొండ
X

దిశ, ‌వెబ్‌డెస్క్ : ‘బద్రి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హే చికితా’ అంటే థియేటర్లు దద్దరిల్లిపోగా, ఆ పాట పవన్ కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ విషయం ఎందుకంటే.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా మూవీ యూనిట్ ఓ పాటను విడుదల చేసింది. ఆ పాట ‘హే చికితా’ పాటను గుర్తుకు తెచ్చేలా ఉండగా, ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

‘అల్లుడు అదుర్స్’ చిత్రం నుంచి విడుదలైన ‘హోలా చికా’ అనే పాట మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా, ఇందులో సాయి శ్రీనివాస్ కౌ బాయ్ గెటప్‌లో కనిపించడం విశేషం. ఈ పాటలో మరోసారి తన డ్యాన్స్ మూమెంట్స్‌తో రెచ్చిపోగా, నభా నటేష్‌ కూడా అదే రేంజ్‌లో చిందులేసింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఫాస్ట్ బీట్ అదిరిపోగా.. జస్ప్రీత్ జాజ్ సింగింగ్ స్టైల్, శ్రీమణి అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత జోష్‌ను తీసుకొచ్చాయి. ఇంతకీ ‘హోలా చికా’ అంటే ఏంటనుకుంటున్నారా? ‘హలో పిల్లా’ అని అర్థం. కాగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్, ప్రకాశ్ రాజ్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1346003383644114944



Next Story

Most Viewed