నెటిజన్ కి హీరోయిన్ ఘాటు రిప్లై.. నీ పురుషాంగం సైజు ఎంత?

147

దిశ, వెబ్ డెస్క్: గ్లామర్ ప్రపంచంలో ఉన్న హీరోయిన్లకు కొన్నిసార్లు అవమానాలు తప్పవు. హీరోయిన్ అంటే ఒక గ్లామర్ డాల్ గానే చూసే ప్రేక్షకులు లేకపోలేదు. కామెంట్ల రూపంలో చెత్త ప్రశ్నలు వేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న నెటిజన్లు కోకొల్లలు. వారి ప్రశ్నలకు తిరిగి దెబ్బ కొట్టే విధంగా సమాధానం చెప్తున్నారు నేటి యువ హీరోయిన్లు. ఈ మధ్యనే న్యూడ్ ఫోటో కావాలని నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియమణి ఘాటు సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.. ముందు మీ అమ్మ , అక్క ఫోటోలను పోస్ట్ చెయ్ .. ఆ తర్వాత నాది పోస్ట్ చేస్తా అని ఘాటు రిప్లై ఇచ్చేసరికి ఆ నెటిజన్ నోరు మూసుకున్నాడు.

ఇక తాజాగా ఇలాంటి ఒక అసభ్య ప్రశ్న టీవీ నటి సయాంతని ఘోష్ కి ఎదురైంది. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఆమె ఫాలోయర్స్ తో మాట్లాడుతూ సూచనలు ఇస్తుంది. అందులో ఒక నెటిజన్ “సయాంతని… నీ బ్రా సైజు ఎంత” అని అడిగేశాడు. దీంతో హీరోయిన్ నెటిజన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. “ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ప్రధానం అని తెలుసుకున్నాను. న్వువ్వు మానసికంగా ఇంకా ఎదగాలి. నువ్వు నా బ్రా సైజు అడిగావు.. నేను కూడా నీలాగే నీ పురుషాంగం సైజు ఎంత అంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? “అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై చూసిన మిగతా నెటిజన్లు సయాంతని శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇకపోతే సయాంతని ‘నాగిని 4 ‘ సీరియల్ తో తెలుగులోనూ సుపరిచితమే..

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..