మార్చి 13న ఐఎస్ఎల్ ఫైనల్

by Kema Shiva Kumar |

<p>దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020/21 సీజన్ ఫైనల్ మార్చి 13న నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్‌డీఎల్) ప్రకటించింది. తాజా సీజన్‌లో 11 జట్లు ఉండటంతో గత ఏడాది కంటే 20 మ్యాచ్‌లు లీగ్ దశలో ఎక్కువగా నిర్వహిస్తున్నామని.. దీంతో ఫైనల్ తేదీని ముందుగా ప్రకటించలేదని తెలిపింది. ప్రస్తుతం ఐఎస్ఎల్ తుది దశకు చేరుకుంటుండటంతో సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ల తేదీలను ప్రకటించింది. మొదటి సెమీఫైనల్ మార్చి 5న, రెండో [&hellip;]</p>

మార్చి 13న ఐఎస్ఎల్ ఫైనల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020/21 సీజన్ ఫైనల్ మార్చి 13న నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్‌డీఎల్) ప్రకటించింది. తాజా సీజన్‌లో 11 జట్లు ఉండటంతో గత ఏడాది కంటే 20 మ్యాచ్‌లు లీగ్ దశలో ఎక్కువగా నిర్వహిస్తున్నామని.. దీంతో ఫైనల్ తేదీని ముందుగా ప్రకటించలేదని తెలిపింది. ప్రస్తుతం ఐఎస్ఎల్ తుది దశకు చేరుకుంటుండటంతో సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ల తేదీలను ప్రకటించింది. మొదటి సెమీఫైనల్ మార్చి 5న, రెండో సెమీఫైనల్ మార్చి 6న, మూడో సెమీఫైనల్ మార్చి 8న, నాలుగవ సెమీఫైనల్ మార్చి 9న నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ మార్చి 13న ఫర్టోడా స్టేడియంలో నిర్వహించనున్నారు.

Next Story