‘హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్’

by  |
Tourism Corporation
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ 400 ఏళ్ల చారిత్రక నగరం. విభిన్న సంస్కృతులకు నిలయం ఈ భాగ్యనగరం. ఇక్కడెన్నో అద్భుతమైన కట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని ఒకే రోజులో సందర్శించే సదవకాశాన్ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కల్పిస్తోంది.హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో హైదరాబాద్ లో చారిత్రక ప్రదేశాలను చూడవచ్చు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం కావడంతో మినీ ఇండియా అని కూడా పిలుస్తారు. నగరంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. దేవాలయాలు, పార్కులు వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిని చూడాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీతో భాగ్యనగరంలోని ప్రముఖ ప్రదేశాలను చూసి కలను నెరవేర్చుకోవచ్చు. హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ పేరుతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు ప్రతి వ్యక్తికి రూ.505గా నిర్ణయించింది. ఈ ప్యాకేజీ అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. దీంతో నగరంలోని అన్ని చారిత్రక ప్రదేశాలను చూడొచ్చు.

8 పర్యాటక ప్రాంతాలు…

ఈ టూర్ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. చార్మినార్, గోల్కొండ, సాలార్జింగ్ మ్యూజియం, బిర్లామందిర్, ట్యాంక్ బండ్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూంబ్స్ ను సందర్శించే అవకాశం ఉంది. అనంతరం తిరిగి రైల్వే స్టేషన్ లో దింపుతారు. ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ చార్జీలు, పార్కింగ్ చార్జీలు ప్యాకేజీలోనే ఉంటాయి. కానీ వసతి, భోజన సదుపాయం, పర్యాటక ప్రాంతాలకు ఎంట్రన్స్ ఫీజు వంటి పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. https:www.irctctourisum.com వెబ్ సైట్లో చూడాలని అధికారులు సూచించారు.

13 నుంచి 22 మంది ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.505 చెల్లించాలని, 7 నుంచి 12 మంది బుక్ చేసుకుంటే ఒక్కొక్కరు రూ.1145లు, అదే ప్యాకేజీని 4 నుంచి 6 మంది బుక్ చేసుకుంటే ఒక్కొక్కరు రూ.1170 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. ఆ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed