కుప్పం పొలాల్లో హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ 

79

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎస్వీఎన్ నగల (SVN Jewellers) వ్యాపారి శ్రీనివాసన్ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన తన కుటుంబంతో కలిసి కోయంబత్తూర్ నుండి తిరుమల వెళ్ళడానికి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదివారం ఉదయం బయలుదేరారు.

మార్గమధ్యంలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కుప్పం సరిహద్దుల్లోని తిరుపత్తూర్ పరిసరాల్లో వాతావరణం అనుకూలించని కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో నగల వ్యాపారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ ను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.