- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగస్వామి ముద్దులతో డిప్రెషన్ వచ్చే ఛాన్స్.. తేల్చి చెప్పిన తాజా అధ్యయనం.. ఆ సమయంలో దూరంగా ఉండటమే బెటర్..
ముద్దులతో ఆనందం పెరుగుతుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. కానీ తాజా అధ్యయనం మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాన్ని వెల్లడించింది. ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్ అండ్ హైపోతెసిస్ ఇన్ మెడిసిన్‌లో ప్రచురితమైన స్టడీ.. భాగస్వామి ముద్దులతో డిప్రెషన్ వస్తుందని తేల్చింది. ఇరాన్‌లో

దిశ, ఫీచర్స్ : ముద్దులతో ఆనందం పెరుగుతుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. కానీ తాజా అధ్యయనం మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాన్ని వెల్లడించింది. ఎక్స్‌ప్లోరేటరీ రీసెర్చ్ అండ్ హైపోతెసిస్ ఇన్ మెడిసిన్‌లో ప్రచురితమైన స్టడీ.. భాగస్వామి ముద్దులతో డిప్రెషన్ వస్తుందని తేల్చింది. ఇరాన్‌లో కొత్తగా వివాహమైన జంటలపై చేసిన అధ్యయనం.. ఒక భాగస్వామి నిరాశ, ఆందోళనతో బాధపడుతుంటే.. వారు తమ ఆరోగ్యవంతమైన భాగస్వామికి కిస్ ఇవ్వడం ద్వారా నోటి బాక్టీరియా ఎక్స్‌చేంజ్ అవుతుందని.. దీనివల్ల మానసిక స్థితి, నిద్ర రీతులలో మార్పులు సంభవించవచ్చని గుర్తించింది.
1,740 కొత్తగా వివాహమైన జంటలను (ఆరు నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం క్రితం వివాహం చేసుకుని కలిసి జీవిస్తున్నవారు) పరిశీలించారు శాస్త్రవేత్తలు. వీరిలో 268 జంటలను అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ప్రతి జంటలో ఒక భాగస్వామి ఆరోగ్యవంతంగా ఉండగా (మానసిక ఆరోగ్య సమస్యలు లేనివారు).. మరొకరు నిద్రలేమి, డిప్రెషన్, ఆందోళన లక్షణాలతో ఉన్నారు (డిప్రెషన్-ఆందోళన ఫినోటైప్ అని పిలుస్తారు). మొదటి రోజు, 180వ రోజు (ఆరు నెలల తర్వాత).. నోటి మైక్రోబయోమ్ నమూనాలను (టాన్సిల్స్, ఫారింక్స్), సాలివరీ కార్టిసాల్ స్థాయిలను (స్ట్రెస్ హార్మోన్) సేకరించారు. పాల్గొనేవారు తమ ఆహారపు ఆలవాట్లు, నోటి పరిశుభ్రత, వ్యాయామ రొటీన్‌లను యథాతథంగా కొనసాగించాలని కోరారు.
నిద్ర నాణ్యత, డిప్రెషన్, ఆందోళనను అంచనా వేయడానికి పిట్స్‌బర్గ్ స్లీప్ క్వాలిటీ ఇండెక్స్ (PSQI), బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీ-II (BDI-II), బెక్ ఆంక్సియటీ ఇన్వెంటరీ (BAI) పర్షియన్ వెర్షన్‌లను ఉపయోగించారు. నోటి మైక్రోబయోమ్ కూర్పును విశ్లేషించడానికి అధునాతన DNA సీక్వెన్సింగ్ టెక్నిక్‌లను ఉపయోగించారు. ఆరు నెలల వివాహం తర్వాత ఆరోగ్యవంతమైన భాగస్వాములు PSQI, BDI-II, BAIలో బేస్‌లైన్‌తో పోలిస్తే గణనీయంగా అధిక స్కోర్‌లను చూపించారు. ఇది డిప్రెషన్, ఆందోళన, నిద్ర నాణ్యత తగ్గుదలను సూచిస్తుంది. ఈ మార్పులు స్త్రీ భాగస్వాములలో మరింత స్పష్టంగా కనిపించాయి.
నీట్‌గా నోటి మైక్రోబయోమ్‌ను సేకరించడం కష్టమైన పని. కాగా ఈ అధ్యయనం టాన్సిల్స్, ఫారింక్స్ నుండి నమూనాలను మాత్రమే సేకరించింది. నిద్రలేమితో బాధపడే భాగస్వాములు బేస్‌లైన్‌లో గణనీయంగా అధిక సాలివరీ కార్టిసాల్ స్థాయిలను కలిగి ఉన్నారు. ఆరు నెలల తర్వాత, ఆరోగ్యవంతమైన భాగస్వాములు కూడా కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలను చూపించారు. ఇది స్ట్రెస్-సంబంధిత శారీరక మార్పులను సూచిస్తుంది. నోటి మైక్రోబయోటా కూర్పులో మార్పులు నిద్రలేమి తీవ్రత, అధిక సాలివరీ కార్టిసాల్ స్థాయిలు, డిప్రెషన్, ఆందోళన స్కోర్‌ల పెరుగుదలతో సంబంధం కలిగి ఉన్నాయి.






