ఏడవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

by Dishanational2 |
ఏడవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
X

దిశ, వెబ్‌డెస్క్ : నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు పెద్దలు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఏడవకూడదు అని చెబుతుంటారు. కానీ నవ్వడమే కాదండోయ్, ఏడవడం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

ఏడవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది.

2. అతిగా ఎడవడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుందంట.

3.ఏడవడం వలన కళ్లు శుభ్రమై, అనేక రకాలైన బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుందంట.

4.మీరు బాధలో ఉండి ఏడిస్తే.. మీ గుండె స్ట్రాంగ్‌ అవుతుంది. ఏది అయితే అది అవుతుంది అని ఆ సమస్యను ఎదుర్కోనే ధైర్యం వస్తుంది.

5.చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడవడం మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదలవుతాయి. ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ వల్ల శారీరక, మానసిక భావోద్వేగాల్లో మార్పులు కలుగుతాయి. శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది

Advertisement
Next Story

Most Viewed