- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూతులు మాట్లాడటం ఆరోగ్యకరమే.. !!
సాధారణంగా బూతులు మాట్లాడేవారు మంచి మనసు కలిగి ఉంటారని ఓ అధ్యయనం తేల్చింది. మనసులో ఉన్న భారాన్ని దించుకునేందుకు వారు ఇలాంటి బూతులు యూజ్ చేస్తారని తెలిపింది. అయితే ప్రతిసారి బూతులు

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా బూతులు మాట్లాడేవారు మంచి మనసు కలిగి ఉంటారని ఓ అధ్యయనం తేల్చింది. మనసులో ఉన్న భారాన్ని దించుకునేందుకు వారు ఇలాంటి బూతులు యూజ్ చేస్తారని తెలిపింది. అయితే ప్రతిసారి బూతులు మాట్లాడటం కాకుండా వారిలో దాగిన ఓ ఎమోషన్‌ను రిలీజ్ చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుటుందని గుర్తించింది. ఇంతకీ ఏ విధంగా బూతులు ఆరోగ్యకరం అనేది చూద్దాం.
సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్ట్ చేసిన ఆర్టికల్ ఇందుకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఆయన ఏం చెప్పారంటే.. బూతులు మాట్లాడటాన్ని కోప్రోలెలియా ( నోట్లో అశుద్ధం) లేదా లోగోషీజియా (పదాల విరేచనం) అంటారు. ఈ పదాలను ప్రతిసారి బూతులు మాట్లాడేటప్పుడు వాడుతారు. అప్పుడప్పుడు మాట్లాడేవాటి గురించి కాదు. నిజానికి మనం మన స్నేహితులు, భాగస్వాములతో మాట్లాడేటప్పుడు లేదంటే మనలో మనం మాట్లాడుకునేటప్పుడు బూతులు ఉపయోగిస్తాం. తీవ్రమైన భావోద్వేగాన్ని రిలీజ్ చేస్తాం. కోపం, బాధ, నిరాశ, నొప్పి.. ఇలా ఎలాంటి ఎమోషన్ ఉన్నా.. మాటల్లో పెట్టేందుకు సాధ్యం కానప్పుడు బూతులను భావోద్వేగాన్ని వ్యక్తపరిచేందుకు వాడుతాం. దీనినే ఎమోషనల్ డిశ్చార్జ్ అంటారు. ఇది మంచిదే. ఉదాహరణకు.. “నేనో వీపీ పనిచేసి ఈ మేనేజరు మొ**** గాడికి దొరికేశాను” అని స్నేహితుడితో చెప్పుతుంటం.. ఇక్కడ డిసప్పాయినెంట్ డిశ్చార్జ్ అవుతుంది.
చాలరకాలైన పనులను ఒకే బూతు పదంతో వివరించవచ్చు. ఉదాహరణకు.. వీడి బుర్ర దె***ది అంటే జడ్జిమెంట్ సరిగ్గా చేయలేడని.. ఈ సినిమా దెం***ది అంటే ఫ్లాప్ అయిందని..ఇలా మాట్లాడుకోవడం స్నేహితులతో సులువు. మెదడుని కష్టపెట్టి మాట్లాడనవసరం లేదు. అలాగే ఏదైనా కష్టమైన శారీరక పనిచేస్తున్నప్పుడు, బూతులు మాట్లాడటం పెర్ఫార్మన్స్ పెంచుతుంది. ఉదాహరణకు ఏదో లాగుతుంటేనో, విరగ్గొడుతుంటేనో, “నా మొ**ది” అని గట్టిగా ఒకసారి ప్రయత్నిస్తే వచ్చేస్తోంది. ఇకపోతే సెక్స్ చేసేటప్పుడు కూడా బూతులు మాట్లాడుకుంటారు.అందులో తప్పేం లేదు. బూతులు మాట్లాడటం వలన స్నేహితులతో సన్నిహితంగా ఉండగలగటం, ఆందోళన, కోపం తగ్గడం వంటి అనేక లాభలున్నాయి. దీనివల్ల మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు.
అయితే సమస్యంతా ఇతరులని బూతులతో తిట్టినప్పుడే. ఎదుటి వ్యక్తిని బాధపెట్టాలనే ఉద్దేశంతో తిట్టడం, ఒకవ్యక్తి వ్యక్తిత్వాన్ని బూతుతో అభివర్ణించడం.. తిట్లలో కుటుంబసభ్యుల్ని చేర్చడం అనేది ఇద్దరిమధ్య సంబంధాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది.






