మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ కంట్రోల్‌లోకే

by Sujitha Rachapalli |   (  Updated:2025-03-05 07:44:30  IST  )

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మందుకు బానిసై రోజూ తాగేవారు మాత్రమే కాదు

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ కంట్రోల్‌లోకే
X

దిశ, ఫీచర్స్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మందుకు బానిసై రోజూ తాగేవారు మాత్రమే కాదు అకేషనల్‌గా పుచ్చుకునేవారికి కూడా ప్రమాదకరమేనని అధ్యయనాలు రుజువు చేసినా.. అందరికి అలాంటి అపాయం ఉండొచ్చు కానీ నేను మాత్రం స్ట్రాంగ్ అనుకుంటారు ఎవరికి వారు. కానీ అసలు నిజం ఏంటంటే లివర్ డ్యామేజ్, గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం, శ్వాస సమస్యలు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశముంది. మెదడు క్రియాశీలత తగ్గి మానసికంగా కూడా నష్టపోయే చాన్స్ ఉంది. అందుకే పూర్తిగా మందు మానేసేందుకు నిర్ణయించుకోమంటున్న నిపుణులు.. ఇందుకు కొన్ని టిప్స్ అందించారు.

* గట్టి నిర్ణయం : తాగుడును పూర్తిగా మానేందుకు మన మనసులో నిజమైన కోరిక ఉండాలి. అందుకే ఈ అలవాటు వల్ల మీరేం నష్టపోతున్నారు, మీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. వర్క్ టైంలో ఈ అలవాటు కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులేంటి గుర్తు పెట్టుకోండి. మీ పరువు, ప్రతిష్ట గురించి ఆలోచించి.. ఓ గట్టి నిర్ణయం తీసుకోండి.

* కారణాలను గుర్తించండి : అసలు మీరు ఎందుకు తాగుతున్నారో ఆలోచించండి. ఇన్నాళ్లు బాగానే ఉన్న మీరు సడెన్‌గా మందుకు ఎందుకు బానిసలయ్యారో గుర్తించండి. ఒత్తిడి, ఒంటరితనం.. ఇలా ఏ కారణం ఉన్నా దాన్ని పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి.

* ఆరోగ్యకరమైన అలవాట్లు : తాగాలనే కోరిక పుట్టినప్పుడు.. హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకోండి. మందుకు బదులుగా నీరు, జ్యూస్ తాగడం.. వాకింగ్‌కు వెళ్లడం, యోగా, ధ్యానం చేయడం.. కొత్తగా మ్యూజిక్, పెయింటింగ్, ఏదైనా గేమ్ నేర్చుకునేందుకు టైమ్ కేటాయించండి.

* కుటుంబ మద్దతు : మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీరు మందు మానాలని నిర్ణయించుకున్నట్టు చెప్పండి. వాళ్ళ మద్దతు మీకు చాలా అవసరం. కాగా మందు కొట్టే ప్రదేశాలు, స్నేహితులను దూరంగా ఉంచండి. మందుబాబుల సమూహాలను దూరం పెట్టండి. కొత్త, ఆరోగ్యకరమైన పరిచయాలు పెంచుకోండి.

* చిన్న విజయాలు : తాగకుండా వారం, నెల పూర్తి చేస్తే మీకు మీరే రివార్డ్ ఇవ్వండి. బహుమతి ఇవ్వడం ద్వారా మీకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఒకవేళ కష్టంగా అనిపిస్తే ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోండి. డీ-అడిక్షన్ సెంటర్ లేదా కౌన్సిలింగ్ తీసుకోవడానికి వెనకాడకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు నియంత్రించుకున్నప్పుడే.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం.

Next Story