తీవ్రంగా వేధిస్తోన్న ‘ఒత్తిడి’.. ఎదుర్కొనేదెలా!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-14 08:23:58  IST  )

ప్రతి ఒక్కరి లైఫ్ లో మానసిక ఒత్తిడి పెద్ద సమస్యగా మారింది. దీని నుంచి బయటపడేందుకు ఈ క్రింద తెలిపిన చిట్కాలు పాటించడం ఉత్తమ మార్గం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తీవ్రంగా వేధిస్తోన్న ‘ఒత్తిడి’.. ఎదుర్కొనేదెలా!?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ బిజీ లైఫ్‌లో సమయం చాలా తక్కువ. ఏ పని చేయాలన్న తొందరగా పూర్తి చేయాలనే తపన ఉంటుంది. దీంతో ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. కొంత మంది పని ప్రారంభించిన నిమిషాల్లోనే పూర్తి చేయాలనే ఆలోచనతో ఒత్తిడిగా ఫీలవుతుంటారు. మరి కొందరైతే ఇంట్లో, ఆఫీసుల్లో ఉండే పనులతో సమయం లేక స్ట్రేస్‌తో సతమవుతుంటారు. అందుకే ప్రస్తుతం మానవుని జీవితంలో ఒక పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒత్తిడి అని చెప్పవచ్చు.

ఏ పనిని సరిగా చేయనివ్వదు. నిజానికి ఓ వ్యక్తి స్ట్రేస్‌గా ఫీల్ అవుతున్నారంటే ప్రధాన కారణం.. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని వైపుల నుంచి పోటీ ఎదురవ్వడంతో తెలియని ఆందోళన ఒకటి వెంటాడుతుంది. వాస్తవానికి మానసిక ఒత్తిడి ఉంటే దేనినీ సాధించలేము. మనసు నిలకడగా ఉండదు. ఏకగ్రత కోల్పోతాము. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ప్రశాంతత దూరం అవుతుంది. ఏ చిన్న పనికైనా చిరాకుగా అనిపిస్తుంది. ఒత్తిడి వల్ల చాలా వరకు నష్టాలే ఉంటాయని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రయత్నించడం ఉత్తమ మార్గం. అయితే.. ఒత్తిడి వల్ల కలిగే చేదు ప్రభావాల నుంచి బయట పడేందుకు కొన్ని మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..

‘ఒత్తిడి’ని ఎదుర్కొనేదెలా..

*ఒత్తిడికి అసలైన మార్గం వ్యాయామం. మీకు స్ట్రేస్‌గా అనిపించినప్పుడు వెంటనే మీ పనిలో నుంచి లేచి కాసేపు నడవండి. ప్రతి రోజు ఉదయాన్నే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు మన మనసుకి ఉత్తేజాన్ని కలిగించే డోపామైన్ అనే ద్రవం మెదడులో విడుదల అవుతుంది. దీంతో రోజంతా చురుగ్గా, చలాకీగా, మరింత ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*ఖాళీ సమయంలో మొబైల్‌తో కాలేక్షేపం చేయకుండా.. పుస్తకాలు చదవడం మంచిది. కదలిక, శబ్దం, చూపు, రుచి, వాసన వంటివి మన మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తాయి. ఆహ్లాదకర దృశ్యాలు చూడడం, చక్కటి సంగీతాన్ని వినడం వంటివి కూడా ఒత్తిడి నుంచి బయటికొచ్చేలా చేస్తాయి. అలాగే, ఆటలంటే ఇష్టపడే వారు ఆడుకోవడం వల్ల కూడా కొంత ఉపశమనం కలుగుతుంది.

*ఒత్తిడి తగ్గించడానికి మంచి నిద్ర కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంటే.. నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి. అలాంటప్పుడే మీరు ఒత్తిడి నుంచి బయటపడగలరు. మీరు నిద్ర పోయినా కూడా ఎదో ఒక అంశం చుట్టూ మీ ఆలోచనలు తిరిగినట్లైతే ఒత్తిడి మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. రాత్రి వేళల్లో కనీసం ఆరు గంటలు నిద్ర పోవాలి. రాత్రి సమయంలో సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి. సాయంత్రం సమయంలో ఎక్కువగా టి, కాఫీ తాగొద్దు.

*ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ మంది అందులోనుంచి బయటకు రావడానికి ధూమపానం, మద్యం సేవించడం, స్వీట్లు, జంక్ ఫుడ్ వంటివి తీసుకుంటారు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి.. తాజా పండ్లు, ఆకుకూరలు కాయగూరలు, గింజలున్న పప్పు , పెరుగు వంటివి తీసుకుంటే కొంత మేర ఒత్తిడి తగ్గే ఆస్కారముంది.

*మీకు ఉన్నట్టుండి చికాకుగా అనిపిస్తే.. స్నేహితులతోనో, ఇరుగుపొరుగు వారితోనో కాసేపు ప్రశాంతంగా మాట్లాడండి. దీని వల్ల ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు ఉత్పత్తి అవటానికి తోడవుతుంది. ఇతరులు మనతో కాసేపు ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే నాడీ పనితీరు కూడా సక్రమంగా ఉండే వీలుంది. దీంతో సామజిక సంబంధాలు కుడా మెరుగవుతాయి.

*ధ్యానం, యోగ వంటివి శరీరం, మనసు కుదురుగా ఉండేందుకు సహకరిస్తాయి. ఏకాగ్రత పెరగడానికి, ఆత్మ విశ్వాసం కలగడానికి కూడా సహకరిస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అందుకే రోజులో ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం విధిగా వీటికి కేటాయించుకుంటే ఒత్తిడి తగ్గటంతో పాటు పనిలో మనకు తెలియాలి చురుకుదనం బాగా కనబడుతుంది.

గమనిక: పైన తెలిపిన సమాచారం నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించండి.


Also Read..

రియల్ లైఫ్ కుంభకర్ణుడు.. ఏడాదిలో 300రోజులు నిద్రే...

Next Story