- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యానికి అరిటాకులో భోజనం.. సంప్రదాయంలో శాస్త్రీయత
పాత రోజుల్లో పెద్దలు “పెళ్లి అయితే పంచభక్ష్య పరమాన్నం అరిటాకులోనే వడ్డించాలి” అని ప్రత్యేకంగా చెప్పేవారు.

దిశ, వెబ్‌డెస్క్: పాత రోజుల్లో పెద్దలు “పెళ్లి అయితే పంచభక్ష్య పరమాన్నం అరిటాకులోనే వడ్డించాలి” అని ప్రత్యేకంగా చెప్పేవారు. నేడు చాలా చోట్ల పేపర్ ప్లేట్లలోనే వడడించేస్తున్నారు. కానీ.. అరిటాకుపై విందు అనేది ఆరోగ్యపరంగానూ, సంప్రదాయపరంగానూ ఎంతో ప్రత్యేకమైందిగా మారుతోంది. తాజాగా న్యూట్రిషన్ నిపుణులు అరిటాకులో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై విశ్లేషణలు వెల్లడించడంతో అరిటాకులో భోజన ప్రాధాన్యతను సంతరించుకుంది.
అరిటాకు స్వభావంలోనే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. భోజనంలో ఉన్న రసాలు, వేడి పదార్థాలు తాకినప్పుడు, ఈ ఆకు నుంచి కొన్ని మైక్రో న్యూట్రియంట్లు భోజనంలోకి చేరతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో హానికరమైన విషతత్వాలను తొలగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అరిటాకు వాడిన తర్వాత ఒక్కసారి ఉపయోగించి పారేసే అవకాశం ఉంటుంది. ఇది మల్టీపుల్ యూజ్ ప్లేట్లతో వచ్చే క్రాస్-కంటామినేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా ఇది హైజినిక్‌గా ఉండడమే కాక, పర్యావరణానికి అనుకూలమైన ఎంపికగా నిలుస్తోంది.
ఆహారం వేడిగా ఉండగా అరిటాకు మీద పెడితే, ఆ ఆకులోని సహజ తేమతో కలిసే ఆహారానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుందని చెబుతారు వంట నిపుణులు. ముఖ్యంగా పులిహోర, పరమాన్నం వంటి వంటకాలు అరిటాకులో వడ్డించినప్పుడు వాటి రుచి మరింత అభివృద్ధి చెందుతుంది.
అరిటాకులో భోజనం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత బలాన్ని నియంత్రించేలా ఉంటుంది. అందుకే పెద్దలు అరిటాకులో భోజనం చేయమని చెప్పేవారు. అంతేకాదు అసిడిటీ, తేలికపాటి జీర్ణం వంటి ఫలితాలు దానితో ఉండటం విశేషం. అరిటాకులో సహజంగా ఉండే టానిన్లు మరియు సాపొనిన్లు వంటి పదార్థాలు, ఆహారంలో ఉన్న హానికర బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకి ఉన్న స్వల్ప సువాసన భోజనానికి ప్రత్యేకమైన రుచిని కూడా ఇస్తుంది.






