Monkeypox: దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-08-13 11:55:25  IST  )

Delhi Reports Fifth Monkeypox Cases| దేశ రాజధాని ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. శనివారం లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (LNJP) ఆసుపత్రిలో మహిళకు నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే శుక్రవారం దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చినట్లు చెప్పారు

Delhi Reports Fifth Monkeypox Cases
X

న్యూఢిల్లీ: Delhi Reports Fifth Monkeypox Cases| దేశ రాజధాని ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. శనివారం లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (LNJP) ఆసుపత్రిలో మహిళకు నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే శుక్రవారం దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య పదికి చేరింది. కాగా అంతకుముందు మంకీపాక్స్ బారిన పడిన నలుగురు కోలుకున్నట్లు వెల్లడించారు. డాక్టర్ల ప్రత్యేక బృందం పేషంట్‌ను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జులై 24న, ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను అంతర్జాతీయ అత్యవసర స్థితిగా గుర్తించిన సంగతి తెలిసిందే. గత నెల 14న కేరళ కొల్లాంలో దేశంలో మొదటి కేసు వెలుగుచూసింది.

ఇది కూడా చదవండి: శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి పుకార్లు, ఫేక్ వార్తలు నమ్మవద్దు

Next Story