- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీకెండ్ అని ఎక్కువ తాగేశారా? హ్యాంగోవర్ పోవాలంటే ఇలా చేయండి
వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది కాస్త రీలాక్స్ అవ్వడం కోసం మద్యం తాగుతుంటారు. అయితే తక్కువ తాగినవారికి సమస్య ఉండదు. కానీ దొరికిందే ఛాన్స్ అనుకుని ఎక్కువ తాగినవారికి మాత్రం మరుసటి

దిశ, వెబ్ డెస్క్: వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది కాస్త రీలాక్స్ అవ్వడం కోసం మద్యం తాగుతుంటారు. అయితే తక్కువ తాగినవారికి సమస్య ఉండదు. కానీ దొరికిందే ఛాన్స్ అనుకుని ఎక్కువ తాగినవారికి మాత్రం మరుసటి రోజు హ్యాంగోవర్ తప్పదు. దీంతో మరుసటి రోజంతా నీరసంగా, తలనొప్పి ఇతర సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు హ్యాంగోవర్ నుండి బయటపడాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. హ్యాంగోవర్‌కు అసలు కారణం డీహైడ్రేషన్. అతిగా మద్యం సేవించడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి నీటిని పుష్కలంగా తాగాలి.
నీళ్లు తాగటం వల్ల డీహైడ్రేషన్ నుండి ఉపశమనం లభించి హ్యాంగోవర్ తగ్గిపోతుంది. నీళ్లు ఎంత తాగాలి అంటే మూత్రం పోసినప్పుడు పచ్చ రంగులో కాకుండా స్వచ్ఛమైన నీళ్ల రంగులో వచ్చే వరకు తాగాలి. అలా చేయడం వల్ల డీహైడ్రేషన్ దాదాపు తగ్గిపోతుంది. హ్యాంగోవర్ సమయంలో భోజనం చేయకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఆహారం ఎక్కువ తీసుకుంటే మీకు కడుపు ఉబ్బరంతో పాటూ జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
హ్యాంగోవర్ కారణంగా కడుపునొప్పి వస్తుంది. కాబట్టి అది తగ్గాలి అంటే అల్లం టీ తాగాలి. ఆల్కహాల్ వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. త్వరగా ఉపశమనం లభించాలి అంటే నీటి కంటే కొబ్బరినీళ్లు తీసుకోవడం చాలా మంచిది. ఒక గ్లాస్ కొబ్బరినీళ్లు తాగటం వల్ల రీఫ్రెష్ అవుతారు. కొబ్బరి నీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ కారణంగా త్వరగా డీహైడ్రేషన్ నుండి బయటపడతారు. మరీ ఇబ్బందిగా ఉంటే ఓఆర్ఎస్ కూడా తీసుకోవచ్చు. వీటితో పాటూ శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరం. కాబట్టి కాసేపు పడుకుంటే మళ్లీ ఉత్తేజంగా రోజును గడిపేస్తారు.






