సీతాఫలం ఎవరు తినకూడదు?

by Sujitha Rachapalli |

సీతాఫలం పోషకాలతో నిండి ఉంటుంది. విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో

సీతాఫలం ఎవరు తినకూడదు?
X

దిశ, వెబ్ డెస్క్ : సీతాఫలం పోషకాలతో నిండి ఉంటుంది. విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఈ పండు మీ శరీరానికి హాని కలిగించవచ్చు. ఇంతకీ ఈ పండు ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు? తెలుసుకుందాం.

* డయాబెటిస్ ఉన్న వారు సీతాఫలం తినకూడదు. ఎందుకంటే ఈ పండులో నేచురల్ షుగర్ ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి.

* ఇక బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ పండును దూరం పెట్టాలి. కారణం ఈ ఫలం ఎక్కువ కాలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువగా తింటే బరువు పెరగొచ్చు. కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది.

* జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండుకు దూరంగా ఉండాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లోటింగ్, గ్యాస్, జీర్ణ సమస్యలు తలెత్తొచ్చు.

* సీతాఫలం తీసుకుంటే కొంత మందికి చర్మంపై దద్దుర్లు, దురద, తుమ్ములు రావచ్చు. జలుబు, దగ్గు ఉన్నప్పుడు కూడా దీన్ని తినకూడదు. దీని చల్లని స్వభావం కారణంగా దగ్గు, జలుబు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

Next Story