Health tips : చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ప్రయోజనాలో..

by  |
Health tips : చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ప్రయోజనాలో..
X

దిశ, వెబ్‌డెస్క్ : నడక ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం రోజుకు 10 నిమిషాలైన నడవాలి అంటారు పెద్దలు. ఇక చెప్పులు లేకుండా నడిస్తే మరీ మంచిది అంటున్నారు నిపుణులు. కానీ, ఇప్పుడు చాలామంది నడవడమే మానేశారు. చిన్న చిన్న పనులకు కూడా వాహనాలు ఉపయోగిస్తున్నారు. వీటివలన వారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడున్న ఈ బిజీ రోజుల్లో నడవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలుసు. అయితే చెప్పులు వేసుకోకుండా నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెప్పులు లేకుండా నడవడం వలన కలిగే ప్రయోజనాలు..

  • చెప్పులు లేకుండా నడవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో ఒకటి మంచి నిద్ర. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కంటినిండా నిద్రపోవడానికి ఈ నడక బాగా సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది.
  • వట్టి కాళ్లతో నడవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. కనుక అప్పుడప్పుడు వట్టి కళ్ళతో నడవండి.
  • వట్టి కాళ్లతో నడవడం అనేది కంటికి కూడా చాలా ఉపయోగ పడుతుంది. ఇలా వట్టి కాళ్ళతో నడవడం వల్ల కంటి చూపు బాగుంటుంది.
  • రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.

Next Story

Most Viewed