పుదీనాతో ఈ జబ్బులు మటుమాయం…

by  |
Health Benefits of Mint Leaves
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకృతిలో మనకు దొరికే ప్రతి ఒక్క మొక్కలోనూ, ఆకులోనూ ఏదో ఒక ఔషధ గుణం కలిగి ఉంటుంది. అలాగే పుదీనాలో మంచి ఔషద గుణాలు ఉంటాయి. ఈ పుదీనా సువాసనలు వెదజల్లుతూ, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే వంటల్లో పుదీనాను వాడుతూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. పుదీనా ఆకును వంటకు మాత్రమే వాడతారు అనుకుంటే పొరపాటే.. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపు ఉంది. మన పూర్వీకుల నుంచీ ఇప్పటివరకూ పుదీనాను ఎన్నో ఆయుర్వేద ఇతర మందుల తయారీలో వాడుతున్నారు. అంతేకాదు, కాస్మొటిక్ కంపెనీలు, ఔషధ కంపెనీలు ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో సాగు చేయిస్తూ… ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతున్నాయి. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మరీ ఇంకెందుకు లేటు పూదీనతో ఆరోగ్య ప్రయోజనాలు చూద్దామా..

పుదీనాతో ప్రయోజనాలు…

  • పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
  • వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు.
  • పుదీనా ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటివలన రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యం బారిన పడకుండా చేస్తాయి.
  • పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
  • చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.
  • నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.
  • చర్మం దురదలుగా ఉన్నప్పుడు ఈ పుదీనా ఆకులను నలిపి ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  • పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది.
  • ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ పూదీన ఆకు రసం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా వాంతులతో బాధపడేవారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.
  • పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని రసం తాగితే ఉదర సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed