అల్లంతో ఆరోగ్యం.. ఆ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం

by  |
అల్లంతో ఆరోగ్యం.. ఆ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం
X

దిశ, వెబ్‌డెస్క్ : అల్లం అందరికి తెలిసిందే, అయితే ఈ అల్లంతో అనేక ప్రయోజనాలున్నాయి. వంటకాల్లో అల్లంకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అల్లం వేయకపోతే కూర రుచిగా అనిపించదు. శరీరానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది అంటారు. ఇక అల్లం టీ తాగితే జలుబు, తలనొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంచెం ఘాటుగా, చేదుగా అనిపించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది.

అల్లంతో గొంతునొప్పికి చెక్

గొంతునొప్పికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పితో బాధపడేవారు అల్లం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇక ఉదయం లేచిన వెంటనే పడి కడుపున అల్లం రసం తాగితే బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. బీపీ, షూగర్‌తో బాధపడేవారు అల్లం రసం తీసుకుంటే చాలా మంచిది.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది:

జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలతో బాధ పడేవారికి అల్లం చాలా ఉపయోగపడుతోంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు అజీర్తి, బ్లోటింగ్, స్టమక్ అప్ సెట్ వంటివి కూడా నయమవుతాయి. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

ఇమ్యూనిటీ

రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ అల్లంను మీ డైట్ లో భాగంగా చేర్చుకోండి. దాంతో ఎటువంటి జబ్బులునైనా ఎదుర్కొనవచ్చు.


Next Story

Most Viewed