కరోనాతో భయపడాల్సిన అవసరం లేదు: హరీశ్ రావు

by B.Srinivas |

<p>దిశ, మెదక్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తే.. ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మాదన్నపేట, దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామాలలో శనివారం సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు కరోనా వైరస్ నివారణకు ఎదుర్కోవాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ [&hellip;]</p>

కరోనాతో భయపడాల్సిన అవసరం లేదు: హరీశ్ రావు
X

దిశ, మెదక్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తే.. ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మాదన్నపేట, దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామాలలో శనివారం సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు కరోనా వైరస్ నివారణకు ఎదుర్కోవాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల ఏప్రిల్ 15 వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ.. తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. అధికారుల సూచనలు పాటిస్తూ.. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు.

Tags: minister harish rao, comments, corona Prevention, dubbaka, siddipet

Next Story