- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్‌డౌన్ కొనసాగుతుంది: హరీష్ రావు
<p>దిశ, మెదక్: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నదని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకుండా చూద్దామని మంత్రి హరీశ్ రావు అధికారులతో చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామస్థాయి […]</p>

దిశ, మెదక్: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నదని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకుండా చూద్దామని మంత్రి హరీశ్ రావు అధికారులతో చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పని చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు, సిబ్బంది చక్కగా పని చేశారని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగిద్దామని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ రోడ్ల మీదకు రావొద్దని సూచించారు. రాత్రి వేళల్లో పారిశుద్ధ్య పనులు, నిత్యావసర వస్తువులు రవాణా జరిగేలా అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
tag: harish rao, review on lockdown, comments, sangareddy






