Dating App: డేటింగ్ యాప్‌లో నటి ఫోటోలు.. పోలీసులను ఆశ్రయించిన గీతాంజలి

by Batti.Sumithra |   (  Updated:2021-05-25 23:49:30  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : సినీ ప్రముఖులపై ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ దాడులు ఎక్కువయ్యాయి. హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ కొందరు ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమస్యనే సినీ నటి గీతాంజలి ఫేస్ చేసింది. దీంతో నటి గీతాంజలి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోలను డేటింగ్ యాప్‌లో పెట్టారంటూ గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తున్నారని నటి తన ఫిర్యాదులో [&hellip;]</p>

Dating App: డేటింగ్ యాప్‌లో నటి ఫోటోలు.. పోలీసులను ఆశ్రయించిన గీతాంజలి
X

దిశ, వెబ్‌డెస్క్ : సినీ ప్రముఖులపై ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ దాడులు ఎక్కువయ్యాయి. హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ కొందరు ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమస్యనే సినీ నటి గీతాంజలి ఫేస్ చేసింది. దీంతో నటి గీతాంజలి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోలను డేటింగ్ యాప్‌లో పెట్టారంటూ గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తున్నారని నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు కోరారు.

Next Story