లాక్‌డౌన్ పెట్టాలని పిటిషన్.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు!

by  |
లాక్‌డౌన్ పెట్టాలని పిటిషన్.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్ విధించుకుని కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ మొదలు, ఆర్థిక రాజధాని మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో సంపూర్ణ, పాక్షిక లాక్‌డౌన్‌లు, రాత్రి నిర్భంధాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అగ్ని పర్వతంలా బద్దలయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా కేరళలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ విధించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో కరోనా కేసుల నివారణకు ఈసీ అమలు చేస్తున్న నిబంధనలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయని.. లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది.

Next Story

Most Viewed