- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బద్దెనపల్లిలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో చెట్టుపైనే గౌడన్న మృతి
<p>దిశ, తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటిచెట్టుపైన గౌడన్నకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గౌడ్ రోజులాగే వృత్తిలో భాగంగా కల్లు తీయడానికి చెట్టుపైకి ఎక్కాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చెట్టుపైనే నరకయాతన అనుభవించి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని […]</p>

దిశ, తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటిచెట్టుపైన గౌడన్నకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గౌడ్ రోజులాగే వృత్తిలో భాగంగా కల్లు తీయడానికి చెట్టుపైకి ఎక్కాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చెట్టుపైనే నరకయాతన అనుభవించి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని జేసీబీ సాయంతో మృతదేహాన్ని కిందకి దింపారు. మృతుడు కిష్టయ్యకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. దీంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేగాకుండా.. గౌడన్నల పరిస్థితి గాలిలో దీపంలా తయారైందని కులస్థులు వాపోయారు.






