హమ్ చేస్తే.. పాట వెతికే పెట్టే గూగుల్ ఫీచర్

by  |
హమ్ చేస్తే.. పాట వెతికే పెట్టే గూగుల్ ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: సంగీతాన్ని మనుషులే కాదు.. మూగజీవాలు కూడా ఆస్వాదిస్తాయి. ఇక కొందరు సంగీతప్రియులు పాటలు వింటూ ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. అయితే, కొన్నిసార్లు మనకు పాట ట్యూన్ గుర్తుంటుంది కానీ.. ఆ పాటకు సంబంధించిన సాకి లేదా పల్లవి గుర్తు రాదు. కనీసం ఆ పాట సినిమా పేరు కూడా గుర్తురాదు. ఇంకొన్నిసార్లు ఎఫ్ఎం లేదా టీవీలో ప్లే అవుతున్న పాట పూర్తయ్యే టైమ్‌లో వింటుంటాం.. ఆ పాట ఏంటో తెలుసుకోవాలని తెగ ఆరాటపడతాం. కానీ తెలిసేదెలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా తాజాగా గూగుల్ ‘హమ్ టూ సెర్చ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

గూగుల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు న్యూ అప్‌డేట్స్ పరిచయం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘హమ్ టూ సెర్చ్’ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. మన గొంతులో ఆగిపోయిన పాటను గుర్తుచేసుకునేందుకు ఉపయోగపడేలా గూగుల్ దీన్ని రూపొందించింది. ఇందుకోసం 10-15 సెకన్ల పాటు హమ్ చేస్తే చాలు.. ఆ పాటకు సంబంధించిన లిరిక్స్ మన ముందు కనిపిస్తాయి.

హమ్ టూ సెర్చ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం కోసం లేటెస్ట్ వెర్షన్ గూగుల్ యాప్‌ను కలిగి ఉండాలి. సెర్చ్ టూల్స్ సెక్షన్‌లో ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా మనం పాడిన పాట ఏంటనేది అది గుర్తిస్తుంది. గూగుల్ సెర్చ్‌ మైక్‌లో ‘వాట్స్ ద సాంగ్’ లేదా ‘సెర్చ్ ఏ సాంగ్’ అనే బటన్‌పై ట్యాప్ చేస్తే చాలు.. నచ్చిన పాటకు సంబంధించి మ్యాచింగ్ లింకులను వెతికి స్క్రీన్ మీద చూపెడుతుంది. హ్యుమన్స్ సింగింగ్, విజిలింగ్ లేదా హుమ్మింగ్ వంటి సంకేతాలను కూడా ఈ ఫీచర్ సులభంగా అర్థం చేసుకోగలదు. గూగుల్ అందిస్తున్న ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో 20 భాషలకు పైగా అందుబాటులో ఉండగా.. ఐవోఎస్ డివైజ్‌లో మాత్రం కేవలం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంది. అందులో కూడా త్వరలోనే మరిన్ని భాషల్లో అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ క్రిష్ణ కుమార్ వెల్లడించాడు.


Next Story

Most Viewed