గూగుల్ మ్యాప్స్ కొత్త లోగో చూశారా?

by  |
గూగుల్ మ్యాప్స్ కొత్త లోగో చూశారా?
X

రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏదైనా దారి తెలియాలన్నా పక్కన వాళ్లను అడగడం మానేసి చాలా రోజులైంది. దారి కావాలంటే మొదట వెతికేది గూగుల్ మ్యాప్‌లో, అందులో అర్థం కాకపోతే వేరే ఆప్షన్. అలాంటి గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చి 15 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్ యాప్ లోగోని మారుస్తున్నట్లు గూగుల్ ప్రకటించి, గురువారం రోజున కొత్త లోగోను విడుదల చేసింది. పాత లోగో డిజైన్‌తో పోల్చితే ఈ డిజైన్ చాలా సింపుల్‌గా అర్థవంతంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం లోగో మాత్రమే కాదు కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గూగుల్ ప్రకటించింది. రెస్టారెంట్లకు రేటింగులు, మ్యాప్ సేవింగులు, ట్రెండింగ్ ఫీడ్ అప్‌డేట్లు, ప్రశ్నలకు చాట్ ద్వారా సమాధానాలు వంటి ఫీచర్లను మెరుగుపరిచినట్లు గూగుల్ తెలిపింది. అలాగే ఉష్ణోగ్రత, యాక్సెసబిలిటీ, విమెన్ సెక్షన్, సెక్యూరిటీ ఆన్‌బోర్డు వంటి సదుపాయాలను సులభంగా ఉపయోగించే విధంగా రూపొందించినట్లు పేర్కొంది. వీటితో పాటు లైవ్ వ్యూ ఫీచర్‌ని వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది.

Next Story

Most Viewed