ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

891
Appsc

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. త్వరలోనే 800 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు స్పష్టం చేశారు. 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. వివిధ శాఖలల్లో ఉన్న ఖాళీలను గుర్తించామని వాటి భర్తీపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకణంపై రాష్ట్ర హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీపీ ఎస్సీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..