- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో విడిభాగాల కొరత, ఉత్పత్తి క్షీణత తప్పదు!
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వాహన తయారీదారులు అంతర్జాతీయంగా షిప్పింగ్ కంటైనర్ల కొరత ఉన్న నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు నెలల్లో విడిభాగాల కొరత, ఉత్పత్తి క్షీణతను ఎదుర్కొంటారని సియామ్ అభిప్రాయపడింది. జులై నుంచి షిప్పింగ్‌లో సరుకు రవాణా రేట్లు పెరిగాయి. ఈ పరిణామాలతో కంపెనీలు సాధారణ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించడం దాదాపు అసాధ్యం’ అని వాహన తయారీ పరిశ్రమల సమాఖ్య(సియామ్) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనర్ చెప్పారు. కొవిడ్-19 సంబంధిత అవాంతరాలు తొలగిన తర్వాత భారత ఆటో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వాహన తయారీదారులు అంతర్జాతీయంగా షిప్పింగ్ కంటైనర్ల కొరత ఉన్న నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు నెలల్లో విడిభాగాల కొరత, ఉత్పత్తి క్షీణతను ఎదుర్కొంటారని సియామ్ అభిప్రాయపడింది. జులై నుంచి షిప్పింగ్‌లో సరుకు రవాణా రేట్లు పెరిగాయి. ఈ పరిణామాలతో కంపెనీలు సాధారణ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించడం దాదాపు అసాధ్యం’ అని వాహన తయారీ పరిశ్రమల సమాఖ్య(సియామ్) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనర్ చెప్పారు. కొవిడ్-19 సంబంధిత అవాంతరాలు తొలగిన తర్వాత భారత ఆటో పరిశ్రమ కోలుకునే సంకేతాలను చూపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ఆందోళన కలిగించే అంశమని రాజేష్ వివరించారు.
అదేవిధంగా, ప్రధాన ఆటో ఎగుమతిదారులు కంటైనర్ల కోసం కొన్ని రోజుల ముందు బుక్ చేసుకునేవారు, ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో కొన్ని వారాలకు ముందే బుకింగ్ చేసుకోవాల్సి వస్తోందని, సరుకు రవాణా ధరలు పెరగడం, ముడి సరుకుల వ్యయ పెరుగుదలను కంపెనీలు గుర్తించుకోవాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ విన్నీ మెహతా వెల్లడించారు.






