- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నమ్మి యువకుడితో రూంకు వచ్చిన ఆంటీకి మద్యం తాపించి.. అదంతా వీడియో తీసి..
<p>దిశ, వెబ్ డెస్క్: రూంలో మహిళకు మద్యం తాపించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పల్వాలలో ఓ మహిళకు సోషల్ మీడియాలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసేవాడు. ఇలా కొద్దిరోజులపాటు వారిద్దరూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. అయితే, ఆ మహిళను ఇటీవల ఒకరోజు పిలిచి ఓ రూంకు తీసుకెళ్లాడు. అతడిని నమ్మి రూంలోకి వచ్చిన ఆమెకు మద్యం తాపించాడు. ఆ […]</p>

దిశ, వెబ్ డెస్క్: రూంలో మహిళకు మద్యం తాపించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పల్వాలలో ఓ మహిళకు సోషల్ మీడియాలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసేవాడు. ఇలా కొద్దిరోజులపాటు వారిద్దరూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. అయితే, ఆ మహిళను ఇటీవల ఒకరోజు పిలిచి ఓ రూంకు తీసుకెళ్లాడు. అతడిని నమ్మి రూంలోకి వచ్చిన ఆమెకు మద్యం తాపించాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా కూడా వీడియో తీశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమెకు ఫోన్ చేసి రూంకు రావాలన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె రూంకు వెళ్లింది. అక్కడ అతనితోపాటు మరో ముగ్గురు కూడా ఆమెకు మద్యం తాపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.






