పశువులను వదిలి మనిషిని తిన్న పులి..

by  |
పశువులను వదిలి మనిషిని తిన్న పులి..
X

దిశ, వెబ్‌డెస్క్ : కుమర్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని దహేగాం మండలం దిగెడ గ్రామంలో పెద్దపులి పంజా విసిరింది. గ్రామ సమీపంలో పశువులను మేపుతున్న గణేశ్‌(22)పై పెద్దపులి దాడి చంపేసింది. అంతటితో ఆగకుండా అటవీ ప్రాంతంలోకి గణేశ్‌ను లాక్కెళ్లింది. అతనితో పాటు మరో యువకుడు కూడా ఆ సమయంలో పశువులకు కాపలాగా ఉన్నాడు. పెద్దపులి దాడిని గమనించిన అతను పొలికేకలు వేసుకుంటూ గ్రామంలోకి పరుగెత్తాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా అడవి వైపు వెళ్లారు. స్థానికుల అరుపులు విన్న పెద్దపులి గణేశ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలికి అటవీశాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. గణేశ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Next Story