కాలిఫోర్నియాలో గాంధీ విగ్రహం ధ్వంసం

by  |

కాలిఫోర్నియా: అమెరికాలో మహత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. కాల్నిఫోర్నియా రాష్ట్రంలో ఓ పార్కులో గల కాంస్య విగ్రహాన్ని ముక్కలు చేసి నేలకూల్చారు. ఈ విషయమై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితులపై విద్వేష చట్టం కింద చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఉత్తర కాలిఫోర్నియాలోని డేవిస్ నగర సెంట్రల్ పార్కులో గల ఆరడుగుల గాంధీ కాంస్య విగ్రహాన్ని మోకాళ్ల వరకు విరగొట్టారు. ముఖ భాగం ధ్వంసం చేశారు. డేవిస్ నగర అధికారులు విగ్రహ భాగాలను పూర్తిగా తొలిగించి, సురక్షిత ప్రాంతంలో భద్రపరిచారు. డేవిస్ సాంస్కృతిక చిహ్నాల్లో మహాత్మా గాంధీ విగ్రహం ఒక్కటని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డేవిస్ పోలీస్‌శాఖ డిప్యూటీ చీఫ్ పాల్ డొరొషోవ్ తెలిపారు.

విగ్రహ ధ్వంసాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా ప్రభుత్వానికి భారత విదేశాంగ తెలిపింది. వీలైనంత త్వరగా నిందితులను శిక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. నాలుగేండ్ల క్రితం భారత ప్రభుత్వం గాంధీ కాంస్య విగ్రహాన్ని బహూకరించగా డేవిస్ నగర కేంద్ర పార్క్‌లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ ఆర్గనైజేషన్ ఫర్ మైనార్టీస్ ఇన్ ఇండియా(ఓఎఫ్ఎంఐ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించారు. కానీ, డేవిస్ నగర పాలక సంస్థ విగ్రహ ఏర్పాటుకే మొగ్గు చూపింది. అప్పటినుంచి గాంధీ విగ్రహం తొలగింపు కోసం ఓఎఫ్‌ఎంఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Next Story

Most Viewed