శ్రియ ‘గమనం’ ఎటు వైపు?

by  |

దిశ, వెబ్ డెస్క్: అందాల భామ శ్రియ శరణ్ సత్తా చాటుతూనే ఉంది. 20 ఏండ్లుగా సౌత్ ఇండస్ట్రీని అలరిస్తూనే ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో మరోసారి ఆకట్టుకోబోతుంది. శ్రియ పుట్టినరోజు పురస్కరించుకుని తన సరికొత్త చిత్రం గమనం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ విష్ చేసింది మూవీ యూనిట్. బస్ ప్రయాణంలో ఉన్న సాధారణ గృహిణిలా శ్రియ లుక్ ఆకట్టుకుంటున్నది.

https://www.instagram.com/p/CE-01eYFTJf/?igshid=847birgmk7bt

డైరెక్టర్ క్రిష్ గమనం ఫస్ట్ లుక్ విడుదల చేయగా థాంక్స్ చెప్పింది శ్రియ. ఈ గిఫ్ట్‌తో తన బర్త్ డేను మరింత స్పెషల్‌గా మార్చిన ‘గమనం’ మూవీ యూనిట్ కు ధన్యవాదాలు తెలిపింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సృజన రావు దర్శకత్వం వహించారు. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రమేష్ కరుతూరి, వెంకి పుషడపు, జ్ఞాణశేఖర్ వి.ఎస్. సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఙ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా కూడా పనిచేస్తుండగా..సాయి మాధవ్ బుర్ర రచయిత. నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.

Read Also…

మెగాస్టార్ లుక్ కు చెర్రీ ఫిదా…

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story